AP Assembly Session: స్పీకర్ కు 'బ్యాడ్ మార్నింగ్' చెప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై ప్రారంభమైన చర్చ

  • వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన బుగ్గన
  • సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స
  • వికేంద్రీకరణ బిల్లుపై కొనసాగుతున్న చర్చ
రాజధాని అంశానికి సంబంధించి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగుతోంది.

మరోవైపు సమావేశం ప్రారంభమైన వెంటనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలోకి స్పీకర్ తమ్మినేని ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. దీనికి ప్రతిస్పందనగా... ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారని... బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ చమత్కరించారు.
AP Assembly Session
Telugudesam
YSRCP

More Telugu News