Jagan: జగన్ మంత్రి వర్గం కీలక నిర్ణయం... సీఆర్డీయే రద్దు!

  • ఈ ఉదయం సమావేశమైన ఏపీ క్యాబినెట్
  • అమరావతి రైతులకు అదనంగా భూమి
  • సీఆర్డీయే స్థానంలో వీజీటీఎం

కొద్దిసేపటి క్రితం వెలగపూడి సెక్రటేరియేట్ లో సమావేశమైన వైఎస్ జగన్ మంత్రివర్గం సీఆర్డీయేను రద్దు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. సీఆర్డీయే స్థానంలో వీజీటీఎంను ఏర్పాటు చేసి, ఉడా పరిధిలో చేర్చేందుకు కూడా మంత్రివర్గం అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు వారికి ఇప్పటికే ఇస్తామన్న భూమికి అదనంగా ఎకరాకు మరో 200 గజాల భూమిని ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం నిమిత్తం సీఆర్డీయే తీసుకున్న రుణాలను ఉడాకు బదలాయించాలని కూడా జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్యాబినెట్ భేటీపై అధికారిక సమాచారం వెలువడాల్సివుంది.

More Telugu News