Jagan: భారీ బందోబస్తు నడుమ... సచివాలయానికి చేరుకున్న వైఎస్ జగన్!

  • రెండో గేటు ద్వారా సచివాలయంలోకి
  • కాసేపట్లో మంత్రివర్గ సమావేశం
  • చేరుకుంటున్న మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెలగపూడిలోని సచివాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఆయన కాన్వాయ్ ని పంపిన ఉన్నతాధికారులు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మరికాసేపట్లో జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుండగా, మంత్రులు సైతం ఒక్కొక్కరుగా వస్తున్నారు.

సచివాలయం రెండో గేటు ద్వారా సీఎం లోపలికి వెళ్లగా, క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. మూడు రాజధానులు, అమరావతి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడం సహా మొత్తం 7 అంశాలపై మంత్రుల మధ్య చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.
Jagan
Velagapudi
Amaravati
Cabinet
Police

More Telugu News