Priyamani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలీవుడ్ సినిమాలో ప్రియమణి 
  • 'ఫైటర్' సరసన బాలీవుడ్ భామ
  • సీక్వెల్ వుందంటున్న రవితేజ
 *  అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో రూపొందుతున్న 'మైదాన్' చిత్రం నుంచి  ఇటీవల కథానాయిక కీర్తి సురేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె స్థానంలో తాజాగా ప్రియమణిని తీసుకున్నట్టు తెలుస్తోంది. వయసు రీత్యా ఆ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావించారట.  
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించే 'ఫైటర్' చిత్రం షూటింగ్ రేపటి నుంచి ముంబైలో జరుగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా అనన్య పాండేను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.  
*  వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'డిస్కో రాజా' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఉద్దేశం కూడా తమకు వుందని రవితేజ చెప్పాడు. ఇక, డిస్కో రాజా తన అభిమానులకు బాగా నచ్చుతుందని, షూటింగులో తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని రవితేజ చెప్పాడు.  
Priyamani
Keerti Suresh
Vijay Devarakonda
Raviteja

More Telugu News