Ala Vaikunthapuramulo: బన్నీ రాకతో విశాఖలో అభిమానుల జోష్... భారీఎత్తున బైక్ ర్యాలీ

  • వైజాగ్ వచ్చిన అల... వైకుంఠపురములో యూనిట్
  • బన్నీకి ఘనస్వాగతం
  • వేల సంఖ్యలో బైకులతో ఫ్యాన్స్ ర్యాలీ

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల... వైకుంఠపురములో చిత్రం భారీ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ కోసం బన్నీ, త్రివిక్రమ్, పూజా హెగ్డే వైజాగ్ రాగా, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలసంఖ్యలో మోటార్ సైకిళ్లతో అభిమానులు బన్నీ వాహనాన్ని వెన్నంటి వచ్చారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన హమ్మర్ వాహనంపైకి ఎక్కి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.

More Telugu News