Gold coin: కోట్లు కుమ్మరించిన ఒక్క నాణెం

  • ఎడ్వర్డ్ బొమ్మ ఉన్న నాణానికి రూ.9.1 కోట్లు 
  • 1936కె ముందు నాణెం ఇది 
  • సొంతం చేసుకున్న పేరు చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తి

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే మరి. ఒక్క నాణెం... కోట్లు కుమ్మరించింది. దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి నాణెం వేలంలో 9 కోట్ల 10 లక్షల రూపాయలు దక్కించుకోవడం విశేషం. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే నాటి బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ముద్రించి ఉండడమే. అంతకు మించి మరే ప్రత్యేకతా లేకున్నా గుర్తు తెలియని వ్యక్తి భారీ మొత్తం వెచ్చించి ఈ నాణాన్ని దక్కించుకోవడం విశేషం. 

1936 కింగ్ ఎడ్వర్డ్-8 అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సనను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించాలనుకున్నాడట. ఈ కాలానికి ముందు ముద్రించిన నాణెం కావడం వల్లే దీనికి అంత గిరాకీ అన్నది పరిశీలకులు అభిప్రాయం.

  • Loading...

More Telugu News