రైల్వే ప్లాట్ ఫామ్స్ పై ఉర్దూకు బదులుగా సంస్కృతం
- సైన్ బోర్డులను మారుస్తున్న ఉత్తరాఖండ్ రైల్వే అధికారులు
- నిబంధనల ప్రకారం హిందీ, ఇంగ్లీష్ తో పాటు రాష్ట్ర ద్వితీయ భాషకు స్థానం
- ఉత్తరాఖండ్ ద్వితీయ భాష సంస్కృతం
ఈ సందర్భంగా ఉత్తర రైల్వే చీఫ్ పీఆర్వో దీపక్ కుమార్ మాట్లాడుతూ, ఓ స్థానిక నేత ఈ అంశాన్ని లేవనెత్తడంతో మొరాదాబాద్ రైల్వే డివిజన్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఈ మేరకు చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. బోర్డుపై సంస్కృత భాషను రాయడానికి దశాబ్ద కాలం ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులుగా... ఉత్తరాఖండ్ గతంలో ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉండేదని... యూపీలో ద్వితీయ భాష ఉర్దూ కావడంతో సైన్ బోర్డులపై ఆ భాష ఉండేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బోర్డులు అలాగే కొనసాగాయని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తు చేశారని... అందుకే బోర్డులను మారుస్తున్నామని తెలిపారు.