Hyundai Kona: గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన హ్యుందాయ్ 'కోనా'

  • అత్యంత ఎత్తుకు ప్రయాణించిన కారుగా ఘనత
  • టిబెట్ పర్వతాల్లో 5731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించిన కోనా
  • గతంలో నియో పేరిట రికార్డు

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజాలు ఇప్పుడు విద్యుత్ సాయంతో నడిచే కార్లపై దృష్టి సారించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కూడా 'కోనా' పేరుతో ఎలక్ట్రిక్ కారు రూపొందించింది. తాజాగా 'కోనా' కారు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ప్రయాణించిన వాహనంగా 'కోనా' సరికొత్త రికార్డు సృష్టించింది. టిబెట్ లోని సవులా పర్వతాల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించిన 'కోనా' గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించింది.

గతంలో ఈ రికార్డు 'నియో' ఎలక్ట్రిక్ కారు పేరిట ఉంది. 'నియో ఈఎస్80' కారు 5,715 మీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. కాగా, 'కోనా' కారుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కష్టసాధ్యమైన పర్వతాల్లోనూ తమ కారుకు తిరుగులేదని 'కోనా' చాటిచెప్పిందని హ్యుందాయ్ మోటార్స్ వర్గాలు గర్వంగా చెప్పాయి.

More Telugu News