Andhra Pradesh: విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు... టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ

  • ముగిసిన సంక్రాంతి సీజన్
  • తిరుగుపయనమైన ప్రజలు
  • కీసర టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
సంక్రాంతి పండుగ పూర్తి కావడంతో సెలవులకు స్వస్థలాలకు వచ్చినవాళ్లు తిరుగు పయనమయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేకంగా 7 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో పంతంగి, కొర్లపాడు టోల్ గేట్లు కూడా ఉండడంతో అక్కడ కూడా రద్దీ తప్పదని భావిస్తున్నారు.
Andhra Pradesh
Vijayawada
Hyderabad
Sankranti
Toll Plaza
Keesara

More Telugu News