Andhra Pradesh: పవన్ కల్యాణ్ తో కలవడం మంచి పరిణామం: కృష్ణంరాజు

  • ఒకటికి రెండు పార్టీలు కలిస్తే బలోపేతం అవ్వచ్చు  
  • రాష్ట్రానికి మంచి జరుగుతుంది 
  • ఏ సిద్ధాంతం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి
సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. జనసేన పార్టీ బీజేపీతో కలవడం పట్ల మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రెండు పార్టీల కలయిక మంచి పరిణామం అని తెలిపారు. ఒకటికి రెండు పార్టీలు చేయి కలిపితే మరింత బలోపేతం అవుతారని, తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు.

సిద్ధాంతాలను కలుపుకుని ముందుకుపోవడం, ఏ సిద్ధాంతం ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా చూసుకుని ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేసినంత కాలం ఎంతో బాగుంటుందని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అటు, బీజేపీ కూడా ఏపీలో కాలుమోపేందుకు ప్రయత్నిస్తోందని, పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ పవన్ కల్యాణ్ తో కలవడం శుభపరిణామంగా అభివర్ణించారు.
Andhra Pradesh
BJP
Janasena
Pawan Kalyan
Krishnamraju

More Telugu News