Telangana: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పనిచేయకపోతే వారిని తొలగిస్తాం: కేటీఆర్

  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు
  • వేములవాడలో కేటీఆర్ ప్రచారం
  • విపక్షాలపై విమర్శలు

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేములవాడలో పర్యటించిన ఆయన పనిచేసే నాయకులకే ఓటు వేయాలని ప్రజలను అర్థించారు. అయితే, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సరిగా పనిచేయకపోతే వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే నాలుగేళ్లలో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణను ముందుకు తీసుకెళతామని, పట్టణాలను అద్భుతమైన రీతిలో అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ విపక్షాలపైనా విమర్శలు చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు పనికంటే మాటలు ఎక్కువని, అలాంటి వాళ్లకు ఓటు వెయ్యడం వృథా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలంటూ ప్రశ్నించారు.

More Telugu News