Ala Vaikunthapuramulo: 'అల.. వైకుంఠపురములో' సినిమాపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలు

  • సిత్తరాల సిరపడు పాటకు విశేష ప్రజాదరణ
  • శ్రీకాకుళం యాసలో సాగిన పాట
  • తమ ప్రాంత సంస్కృతిని అందరికీ తెలియజెప్పారన్న రామ్మోహన్ నాయుడు
ఇటీవల సంక్రాంతి సీజన్ లో విడుదలైన అల... వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో సిత్తరాల సిరపడు అనే జానపద గీతం కూడా ఉంది. ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ యువ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు.

శ్రీకాకుళం జిల్లా సంస్కృతి, సాహిత్యం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సిత్తరాల సిరపడు పాట ద్వారా వివరించారంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, లిరిక్ రైటర్ విజయ్ కుమార్ భల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఓ స్టయిలిష్ ఫైట్ కోసం నేపథ్యంగా తమ ప్రాంతపు పాటను వాడుకున్నందుకు అల్లు అర్జున్ కు కూడా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పాట పాడిన సూరన్న, కొమాండూరి సాకేత్ లకు కూడా యువ ఎంపీ థ్యాంక్స్ చెప్పారు.
Ala Vaikunthapuramulo
Allu Arjun
Trivikram
Rammohan Naidu
Telugudesam
Srikakulam District

More Telugu News