Pavan: క్రిష్ దర్శకత్వంలో పవన్ .. విలన్ గా బాలీవుడ్ నటుడు?

  • పవన్ హీరోగా 'పింక్' తెలుగు రీమేక్
  • తదుపరి సినిమా దర్శకుడిగా క్రిష్ 
  • త్వరలోనే మిగతా వివరాలు
'పింక్' రీమేక్ తో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఇక పవన్ రెగ్యులర్ గా సినిమాలు చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. 'పింక్' తరువాత ఆయన దాదాపు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. నిర్మాత ఎ.ఎమ్.రత్నం బ్యానర్లో పవన్ ఒక సినిమా చేయవలసి వుంది. పవన్ రాజకీయాల్లోకి రావడం వలన ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది.

ఇప్పుడు ఎ.ఎమ్.రత్నం ఈ ప్రాజెక్టును క్రిష్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. బుర్రా సాయిమాధవ్ తో కలిసి స్క్రిప్ట్ పై ఆయన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన కూడా వుంటుందట. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Pavan
Krish

More Telugu News