Janasena: జనసేన, బీజేపీ కలయిక చూసి వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతోంది: నాదెండ్ల మనోహర్

  • దూకుడు పెంచిన జనసేన నేతలు
  • స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్న నాదెండ్ల
  • బీజేపీతో పొత్తు రాష్ట్రానికే లాభం అని వ్యాఖ్యలు
జనసేన నేతలు దూకుడు పెంచారు. ఇటీవలే బీజేపీతో చేయి కలిపిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికలపై బాగా దృష్టి పెట్టింది. దీనిపై జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన పొత్తు వల్ల రాష్ట్రానికి లాభం అని తెలిపారు. జనసేన, బీజేపీ కలయిక చూసి వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతోందని అన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.
Janasena
BJP
Nadendla Manohar
Andhra Pradesh
YSRCP
Pawan Kalyan
Narendra Modi

More Telugu News