కుమారుడి మరణవార్త విని తల్లి మృతి!
- చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విషాద ఘటన
- గుండెపోటుతో వినోద్ కుమార్ (30) మృతి
- విషయం తెలుసుకుని కుప్పకూలిపోయిన తల్లి సరోజమ్మ (59)
వివరాల్లోకి వెళ్తే... వినోద్ కుమార్ (30) అనే వ్యక్తి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సమయంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతడి తల్లి సరోజమ్మ (59) ఇంట్లో ఉంది. తనయుడు చనిపోయాడని ఆమెకు సమాచారం అందింది. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుప్పకూలిపోయి మృతి చెందింది.