TRS: ఎంఐఎంను బూచిగా చూపి ఓట్లు దండుకోవాలన్నది బీజేపీ కుట్ర: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • ఎంఐఎంతో మా పార్టీకి పొత్తు ఉందని ఎలా ఆరోపిస్తారు
  • మున్సిపల్ ఛైర్మనే కాదు.. వైస్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వం  
  • ఎత్తిపోతల పథకానికి 24గంటల్లో జాతీయ హోదా తెస్తారా?

మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎంఐఎంకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెడుతుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ తరహా దుష్ర్పచారంతో ఓట్లు దండుకోవాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

  ఎంఐఎంకు ఛైర్మన్ పదవిని కానీ వైస్ ఛైర్మన్ పదవిని కానీ ఇవ్వమని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నట్లు నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీకి చాతనైతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి 24 గంటల్లో జాతీయ హోదా తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు సవాల్ విసిరారు.

More Telugu News