Ntr: సెట్లో ఎన్టీఆర్ వుంటే ఆ సందడే వేరు: హీరో చరణ్

  • నేను .. ఎన్టీఆర్ మంచి స్నేహితులం 
  • కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టం 
  • ఎన్టీఆర్ మంచి సందడి మనిషన్న చరణ్
ఒక వైపున నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ .. మరో వైపున హీరోగా చరణ్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ .. నేను చాలా కాలం నుంచి స్నేహితులం. మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉంటాము. అలాంటి మాకు రాజమౌళిగారి వలన కలిసి పనిచేసే అవకాశం లభించింది.

ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండటం వలన చకచకా సీన్స్ చేసుకుపోతున్నాము. ఎన్టీఆర్ సెట్లో వుంటే సందడే సందడిగా ఉంటుంది. సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఆయనకి షూటింగు లేక సెట్ కి రాకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఆయనను చాలా మిస్సవుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చాడు.

Ntr
Charan

More Telugu News