తిరుమలలో టీటీడీ చైర్మన్ తో భేటీ అయిన మహేశ్ బాబు బృందం

17-01-2020 Fri 15:52
  • సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం
  • తిరుమల వెళ్లిన చిత్రబృందం
  • శ్రీవారి దర్శనం చేసుకున్న మహేశ్ బాబు తదితరులు

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో హీరో మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటి విజయశాంతి తదితరులు తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం అనంతరం మహేశ్ బాబు బృందం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైంది. తిరుమల గెస్ట్ హౌస్ లో వైవీతో మహేశ్ బాబు తదితరులు ముచ్చటించారు. ఈ భేటీలో మహేశ్ బాబు బాబాయి ఆదిశేషగిరిరావు కూడా పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.