Botsa Satyanarayana: హైపవర్ కమిటీ ఈమెయిల్ ను ఎవరో హ్యాక్ చేశారు: బొత్స

  • అమరావతి రైతులు భయపడాల్సిన అవసరం లేదు
  • నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పూర్తి చేస్తాం
  • రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన పార్టీ వైసీపీ
అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లామని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన పార్టీ తమదని చెప్పారు. రైతులకు చిన్న సమస్య వచ్చినా... పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగానే తాము భావిస్తామని అన్నారు. హైపవర్ కమిటీ ఈమెయిల్ ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు.

ప్రజల మనోభావాల మేరకు సమగ్ర ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని బొత్స తెలిపారు. కమిటీ రిపోర్టును కేబినెట్ ముందు ఉంచుతామని... భేటీకి సంబంధించిన విషయాలను సీఎంకు చెబుతామని అన్నారు. అమరావతి రైతులు భయపడాల్సిన అవసరం లేదని... నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలను ఉపయోగించుకుంటామని తెలిపారు.
Botsa Satyanarayana
YSRCP
Amaravati
Jagan

More Telugu News