Telugudesam: కశ్మీర్ సమస్యను పరిష్కరించిన కేంద్రానికి.. అమరావతి చిన్న విషయమే!: పయ్యావుల కేశవ్

  • ఏపీ రాజధానిపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి
  • బీజేపీ-జనసేన రాజధానికోసం ఏం చేస్తాయో చూడాలి 
  • రాజధానిపై కేంద్రానికి చెప్పి చేస్తున్నామని వైసీపీ అంటోంది
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ కలయికను కీలక పరిణామంగా అభివర్ణించారు. ఆ రెండు పార్టీలు రాజధానికోసం ఏం చేస్తాయోనని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కొత్త పొత్తుల శక్తి భవిష్యత్తులో తెలుస్తుందని పేర్కొన్నారు.

అమరావతి మార్పుపై కేంద్రానికి చెప్పి చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అంటోందని, రాజధాని అంశంపైనే బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అన్నారు. రాజధానిపై ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన కేంద్రానికి అమరావతి చిన్న విషయమేనన్నారు. అయితే, రాజధాని తరలింపుకు కేంద్రం ఆమోదం తెలిపిందా?.. అన్న అనుమానం ఓపక్క ఉందని కేశవ్ అన్నారు.
Telugudesam
Payyavula Keshav
Amaravati
BJP
YSRCP

More Telugu News