Ireland: విండీస్‌కు షాకిచ్చిన పసికూన ఐర్లాండ్.. ప్రపంచ చాంపియన్‌కు ముచ్చెమటలు!

  • ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓటమి
  • విండీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్
  • విజయం ముంగిట విండీస్ బోల్తా

ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవల గత ప్రాభవాన్ని కోల్పోయి విలవిల్లాడుతోంది. 2012 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని ఆశలు రేకెత్తించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ చతికిలపడింది. అంచనాలను అందుకోలేక తంటాలు పడుతోంది. తాజాగా, పసికూన ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ప్రపంచంలోనే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన విండీస్.. ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ఇరు జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ నాలుగు పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్ (95), కెవిన్ ఒబ్రియాన్ (48)లు చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా పడింది.

More Telugu News