Amaravati: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మహిళల ఆగ్రహం

  • 18 మంది రైతులు మరణించినా పరామర్శించలేదు
  • మమ్మల్ని కలిసినట్టు అబద్ధాలు చెబుతున్నారు
  • మా పోరాటం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మందడం మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ మందడం రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. నిన్న మహిళలు, రైతులు కలిసి భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దని, అమరావతి చాలని పెద్ద ఎత్తున నినదించారు.

రాజధాని కోసం గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, 18 మంది రైతులు మరణించినా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమె తమను కలిసి పరామర్శించినట్టు చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తమను కలవలేదని తేల్చి చెప్పారు. అమరావతి కోసం తమ పోరాటం కేవలం తమకోసం మాత్రమే కాదని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసమని మహిళలు పేర్కొన్నారు.
Amaravati
Farmers
Andhra Pradesh
Vundavalli Sridevi

More Telugu News