YSRCP: కడప నుంచి విజయవాడ వెళ్లే విమానానికి తప్పిన ముప్పు

  • టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానానికి పక్షి ఢీ
  • వెనక్కి మళ్లించి అత్యవసరంగా దించేసిన పైలెట్
  • విమానంలో వైసీపీ నేత సజ్జల  
కడప నుంచి విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానానికి ఈ రోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానానికి ఓ పక్షి తగిలింది. దాంతో ఆ విమానాన్ని వెనక్కిమళ్లించి అత్యవసరంగా కిందికి దించారు. ఆ సమయంలో విమానంలో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వున్నారు. మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
YSRCP
Sajjala Ramakrishnareddy
Trujet
Plane
Bird
Kadapa
Vijayawada

More Telugu News