Buddha Venkanna: మూడు రాజధానుల వెనుక ఉన్న అసలు నిజమిదే: బుద్ధా వెంకన్న

  • విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్
  • రూ. 50 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు
  • మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న వెంకన్న
విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇప్పటికే కొల్లగొట్టిన డబ్బులు చాలక, మరో రూ. 50 వేల కోట్లు కొల్లగొట్టేందుకే మూడు రాజధానులని ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు. "విశాఖలో జరుగుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్ గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్ పిన్ గా మారిన ఎంపీ విజయసాయి రెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయం" అన్నారు.

ఆపై "గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు సీఎం వైఎస్ జగన్ గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో 50వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు" అని మండిపడ్డారు.
Buddha Venkanna
3 Capitals
Andhra Pradesh
Jagan
Vijay Sai Reddy

More Telugu News