BSE: ఆల్ టైమ్ రికార్డుకు భారత స్టాక్ మార్కెట్!

  • 42 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్
  • భారీ లాభాల్లో ఫార్మా కంపెనీలు
  • అమ్మకాల ఒత్తిడిలో మెటల్స్

భారత స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త రికార్డులను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతూ ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ అత్యంత కీలకమైన 42 వేల పాయింట్లను అధిగమించింది. నిఫ్టీ సైతం తన ఆల్ టైమ్ రికార్డును సవరించుకుంది.

ఈ ఉదయం 10 గంటల సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, క్రితం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్లు పెరిగి 12,380 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 162 పాయింట్లు పెరిగి 42,035 పాయింట్ల వద్ద ఉంది.
యస్ బ్యాంక్, నెస్టిల్, హిందుస్థాన్ యూనీలీవర్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, వీఈడీఎల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హీరో మోటో, జేఎస్ డబ్లూ స్టీల్ తదితర కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా కంపెనీలు లాభాల్లో దూసుకెళుతుండగా, మెటల్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి.

More Telugu News