Jammu And Kashmir: ప్రభుత్వ బంగ్లాకు ఒమర్ అబ్దుల్లా షిఫ్ట్!

  • గతేడాది ఆగస్టు 5 నుంచి గృహ నిర్బంధంలో మాజీ సీఎంలు
  • నేడు గుపార్క్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాకు ఒమర్ అబ్దుల్లా తరలింపు
  • ఎప్పుడు విడుదల చేసేది చెప్పని ప్రభుత్వం

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధంలోకి తీసుకుంది. వీరిలో మాజీ ముఖ్యమంత్రులైన ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివారు ఉన్నారు. గతేడాది ఆగస్టు 5 నుంచి వీరు గృహ నిర్బంధంలో ఉన్నారు. శ్రీనగర్‌లోని హరినివాస్‌లో గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వం తాజాగా మరో చోటికి మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేడు హరినివాస్ నుంచి గుపార్క్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లా ఎం-4కు మార్చనున్నారు.

శ్రీనగర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ లేన్‌లో ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని మాత్రం ఎక్కడికీ మార్చడం లేదు. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై పీఎస్ఏ అమలు చేయడంతో గుప్కార్ రోడ్డులో ఆయన గృహనిర్బంధంలో ఉన్నారు. వీరిని ఎప్పుడు విడిచి పెడతారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.  

More Telugu News