Hyderabad: యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలో అగ్నిప్రమాదం

  • డ్రైక్లీనింగ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్
  • పక్కనే ఉన్న షాపులకు కూడా పాకిన మంటలు
  • మూడు దుకాణాలు దగ్ధం
హైదరాబాద్, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు సమీపంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో డ్రైక్లీనింగ్ దుకాణంతోపాటు పక్కనే ఉన్న సోఫా, స్టేషనరీ దుకాణాలు కాలి బూడిదయ్యాయి. దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో షాపు నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే పక్కనే ఉన్న మరో రెండు దుకాణాలకు మంటలు వ్యాపించి బూడిద చేశాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Yousufguda
Fire Accident

More Telugu News