Russia: ప్రజలనుద్దేశించి ప్రసంగం.. ఆ వెంటనే రష్యా ప్రధాని రాజీనామా!

  • లక్ష్యాలను చేరుకోవడంలో మెద్వదేవ్ ప్రభుత్వం విఫలం
  • రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన అధ్యక్షుడు పుతిన్
  • కొత్త ప్రధానిగా మిషుస్తిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి సమర్పించారు. లక్ష్యాలను చేరుకోవడంలో మెద్వదేవ్ ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్న పుతిన్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మెద్వదేవ్ రాజీనామా చేశారు. అంతకుముందు ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ క్రమంలో రష్యా తదుపరి ప్రధానిగా మిషుస్తిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా ఉన్న ఆయన పేరును అధ్యక్షుడు పుతిన్ ప్రధాని పదవికి ప్రతిపాదించారు. కాగా, నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు కొనసాగాల్సిందిగా మెద్వదేవ్ మంత్రివర్గాన్ని అధ్యక్షుడు పుతిన్ కోరినట్టు సమాచారం. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన మెద్వదేవ్ 2012 నుంచి రష్యా ప్రధానిగా ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మెద్వదేవ్‌ను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
Russia
dmitry medvedev
vladimir putin

More Telugu News