Pooja Hegde: ఇలా రోడ్లపై పడుకోవద్దు.. ఇంటికి పోరా నాయనా!: అభిమానికి హితవు చెప్పిన పూజా హెగ్డే

  • పూజా హెగ్డేను కలిసేందుకు ముంబయి వెళ్లిన తెలుగు యువకుడు
  • రాత్రుళ్లు ఫుట్ పాత్ పై పడుకుంటూ నటి కోసం పడిగాపులు
  • మందలించిన పూజా హెగ్డే
సినీ తారలపై కొందరు వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. హీరోయిన్లనైతే దేవతలకంటే ఎక్కువగా ఆరాధించేవాళ్లు చాలామంది ఉంటారు. తాజాగా భాస్కర్రావు అనే ఓ తెలుగు యువకుడు యువ నటి పూజా హెగ్డే అంటే వెర్రి అభిమానం పెంచుకున్నాడు. ఆమెను కలిసేందుకు ఏకంగా ముంబయి వెళ్లి అక్కడి ఫుట్ పాత్ లపై పడుకుంటూ ఓపిగ్గా ఎదురుచూశాడు. అయితే, భాస్కర్రావు వ్యవహారం తెలుసుకున్న పూజా హెగ్డే అతడ్ని కలుసుకుని హితవు పలికారు.

ఇలా రోడ్లపై పడుకోవడం, ఫుట్ పాత్ పై ఉండడం మంచిది కాదని చెప్పారు. దయచేసి సొంతూరు వెళ్లిపోవాలని సూచించారు. తన కోసం ఓ అభిమాని అంత కష్టపడడం తనకు బాధ కలిగించిందని, ఇలాంటి అభిమానాన్ని తానెప్పుడూ కోరుకోనని పూజా వెల్లడించారు. "నీ ప్రేమ నాకర్థమైంది. నువ్వు ఎక్కడున్నా నీ అభిమానాన్ని తప్పకుండా ఫీల్ అవుతుంటాను. మీరే నా బలం. ముందు నువ్వు ఇంటికెళ్లు" అంటూ పూజా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.

Pooja Hegde
Fan
Mumbai
Bhaskarrao
Tollywood

More Telugu News