Sankranti: కో'ఢీ' పందేల్లో గెలుస్తున్నది ఏ జాతో తెలుసా?

  • బొబ్బిలిలో పెరుగుతున్న కాకి డేగ
  • ప్రత్యేకంగా పెంచుతున్న నెల్లిపర్తి కాలేజీ
  • అత్యధిక పోటీల్లో దీనిదే విజయం

తెలుగు ప్రాంతంలో... ముఖ్యంగా పౌరుషానికి మారుపేరుగా నిలిచే బొబ్బిలి ప్రాంతంలో పెరిగిన కోళ్లకు, అందునా, నెల్లిపర్తి ప్రాంతంలో పెరిగే 'కాకి డేగ పుంజు' వెరైటీకి కోడి పందాల్లో విపరీతమైన మద్దతు లభిస్తోంది. నిన్నటి నుంచి జరిగిన పందాల్లో కాకి డేగ రకానికి చెందిన పుంజులు అత్యధికం పౌరుషాన్ని చూపుతూ ప్రత్యర్థి కోడిని పడేస్తుండటంతో, వీటికి డిమాండ్ పెరిగింది.

నెల్లిపర్తిలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీల ఆవరణలో ప్రత్యేక శ్రద్ధతో వీటిని పెంచడంతో వీటికి పందెం రాయుళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ వస్తోంది. కోళ్లకు శిక్షణను ఇస్తూ, వాటికి పుష్టికరమైన ఆహారాన్ని పెట్టడంతో పాటు, రోషాన్ని పెంచడంలోనూ ప్రత్యేక శ్రద్ధను కనబరచడంతో వీటికి డిమాండ్ తెగ పెరిగిపోయింది.

బరిలో డేగ ఉందంటే, దానిపైనే పందేలు ఎక్కువగా పడుతున్న పరిస్థితి. ఇక డేగలను ఎదిరించేందుకు కాకి పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ. రసంగి, అబ్రాసు, నెమలి తదితర రకాల కోళ్లూ సిద్ధమయ్యాయి. ఈ కోళ్లు ఒక్కొక్కటీ రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకూ ఖరీదు చేస్తాయని కోళ్ల పెంపకందారులు అంటున్నారు.

More Telugu News