నేడే మకర జ్యోతి దర్శనం... తెలుగు రాష్ట్రాల స్వాములతో కిక్కిరిసిన శబరిమల!
- నేడు మకర రాశిలోకి భానుడు
- సాయంత్రం దర్శనమివ్వనున్న మకర జ్యోతి
- వేచి చూస్తున్న లక్షలాది మంది
కాగా, మకర జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇప్పటికే శబరిగిరులు భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు ప్రస్తుతం పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్లలో, జ్యోతి దర్శనం నిమిత్తం టీబీడీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి చూస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు సన్నిధానానికి వస్తుండగా, ప్రధాన పార్కింగ్ ప్రాంతమైన నీలక్కర్ వాహనాలతో కిక్కిరిసిపోయింది.
నీలక్కల్ నుంచి పంబ వరకూ ఏ ఒక్క వాహనాన్నీ అనుమతించే పరిస్థితి లేకపోగా, కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు భక్తులను చేరుస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే సుమారు 80 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకోగా, మరో వారం రోజుల పాటు గర్భాలయం తలుపులు చెరచే ఉంటాయి. 21వ తేదీన ప్రత్యేక పడిపూజ అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తామని ప్రధాన తంత్రి వెల్లడించారు.