Ranga Reddy District: మునిసిపల్ ఎన్నికల ‘చిత్రం’.. ప్రత్యర్థులుగా బరిలోకి తల్లీకూతుళ్లు!

  • రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఘటన
  • కాంగ్రెస్ అభ్యర్థిగా తల్లి.. టీఆర్ఎస్ మద్దతుతో కుమార్తె
  • పట్టణంలో చర్చనీయాంశంగా మారిన పోటీ
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్  ఎన్నికల్లో తల్లీకూతుళ్లు ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. గెలుపు కోసం ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఇలా ప్రత్యర్థులుగా బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పులికంటి నాగమ్మ కుమార్తె అలివేలు ఇటీవల పట్టణానికే చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. స్థానికంగానే ఉంటున్న ఆమె ‘పుర’ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగింది. ఆమె తల్లి నాగమ్మ అదే వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీకి సై అనడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం పట్టణంలో చర్చనీయాంశం కాగా, గెలుపు ఎవరిదన్న దానిపై ఊహాగానాలు నెలకొన్నాయి.
Ranga Reddy District
Municipal Elections
Telangana

More Telugu News