Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • దుల్ఖర్ సరసన కథానాయికగా కాజల్ 
  • 20 నుంచి ముంబైలో 'ఫైటర్'
  • తెలుగులోకి మరో కొరియన్ సినిమా  
  *  ఇటీవల కాలంలో దక్షిణాదిన హవా తగ్గిన కథానాయిక కాజల్ అగర్వాల్ తాజాగా ఓ తమిళ చిత్రాన్ని అంగీకరించింది. మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ నటించే తమిళ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించే 'ఫైటర్' చిత్రం షూటింగ్ ఈ నెల 20 నుంచి ముంబైలో జరుగుతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.  
*  ఆమధ్య సమంతతో 'మిస్ గ్రానీ' కొరియన్ సినిమాను 'ఓ బేబీ' పేరిట తెలుగులో రీమేక్ చేసిన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ, తాజాగా మరో రీమేక్ మీద కన్నేసింది. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని కూడా రీమేక్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. 
Kajal Agarwal
Dulkhar Salman
Vijay Devarakonda
Samantha

More Telugu News