Andhra Pradesh: గుండెపోటుతో వెలగపూడి రైతు మృతి
- రాజధాని కోసం 20 సెంట్ల భూమి ఇచ్చిన రైతు
- గత నెల రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న వెంకటేశ్వరరావు
- వెనక్కి తగ్గేది లేదని మంత్రులు ప్రకటించడంతో మనస్తాపం
అమరావతి కోసం ఆందోళన చేస్తున్న మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలింపును నిరసిస్తూ దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన రైతు ఇడుపులపాటి వెంకటేశ్వరరావు (70) కూడా పాల్గొంటున్నారు.
రాజధాని నిర్మాణానికి ఆయన తనకున్న 20 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాకపోవడం, రాజధాని తరలింపుపై వెనక్కి తగ్గేది లేదని మంత్రులు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.