Pawan Kalyan: పవన్ కల్యాణ్ తీరు సరికాదు: వైసీపీ నేత ద్వారంపూడి

  • ఓ పథకం ప్రకారం మా ఇంటిపై దాడికి యత్నించారు
  • పవన్ కు నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారు
  • రాజధాని సాకుతో అలజడి సృష్టించేందుకు బాబు కుట్ర
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన నివాసం ముట్టడికి జన సైనికులు యత్నించడం తెలిసిందే. ఈ ఘటనపై ద్వారంపూడి స్పందిస్తూ, పవన్ కల్యాణ్ తీరు సరికాదని, ఓ పథకం ప్రకారం తమ ఇంటిపై దాడికి యత్నించారని మండిపడ్డారు.

ధర్నా జరిగిన ప్రాంతం ఎక్కడ? తమ నివాసం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. పవన్ కు జనసేన నేత పంతం నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. రాజధాని సాకుతో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఈ దాడికి పాల్పడ్డారని, అయినప్పటికీ తమ కార్యకర్తలు సంయమనం పాటించారని చెప్పుకొచ్చారు. దాడుల సంస్కృతిని జనసేనే తీసుకొచ్చిందని ఆరోపించారు.
Pawan Kalyan
janasena
Dwarampudi
YSRCP

More Telugu News