Andhra Pradesh: ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆంధ్రుల రాజధాని అమరావతేనని చాటండి: చంద్రబాబు

  • ప్రజలు అమరావతి ఉద్యమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి
  • రైతుల కష్టంపై ట్వీట్
  • జీవితకాలపు రాజధాని కోసం స్పందించాలన్న చంద్రబాబు

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. పండుగలు ఎన్నో వస్తాయి కానీ, ఈ పండుగ వేళ అమరావతి రైతులకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని, ఏ పండుగ నాడూ రైతు ఇలాంటి కష్టంతో బాధపడకూడదని ట్వీట్ చేశారు.

రాజధాని కోసం, జీవితకాలపు నిజమైన సంక్రాంతి కోసం, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మీ మద్దతు తెలియజేయాలని కోరారు. రాజధానికి మద్దతు తెలుపుతూ 84 60 70 80 90 అనే నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. తద్వారా ఆంధ్రుల రాజధాని అమరావతేనని చాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News