Mumbai: ముంబయి వాంఖడేలో నిరాశపర్చిన టీమిండియా బ్యాటింగ్

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్
  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 49.1 ఓవర్లలో భారత్ 255 ఆలౌట్

బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తొలి వన్డేలో భారత్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని పేరున్న వాంఖడే పిచ్ పై శిఖర్ ధావన్ (74), కేఎల్  రాహుల్ (47) మినహా మిగతా ఎవ్వరూ భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయారు. రిషబ్ పంత్ (28), రవీంద్ర జడేజా (25) పోరాడినా అది కాసేపే అయింది. లోయరార్డర్ లో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, షమి రెండంకెల స్కోరు చేయడంతో టీమిండియా గౌరవప్రదమైన టోటల్ నమోదు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, ప్యాట్ కమిన్స్ 2, కేన్ రిచర్డ్సన్ 2 వికెట్లు సాధించి భారత బ్యాటింగ్ లైనప్ ను నియంత్రించారు. జంపా, అగర్ లకు చెరో వికెట్ దక్కింది.

More Telugu News