పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్ద ఉద్రిక్తత

14-01-2020 Tue 17:14
  • హెలికాన్ టైమ్స్ హోటల్ కు చేరుకున్న పవన్
  • పోటీలు పడి నినాదాలు చేసిన జనసేన, వైసీపీ శ్రేణులు
  • రోడ్డును క్లియర్ చేసిన పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన బస చేసిన హెలికాన్ టైమ్స్ హోటల్ వద్దకు భారీ సంఖ్యలో జనసేన, వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాలు తమ పార్టీలకు మద్దతుగా పోటీపడి నినాదాలు చేశాయి. అప్పటికే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఇరువర్గాలను నియంత్రించే ప్రయత్నం చేశారు. రోడ్డును క్లియర్ చేయడంతో పవన్ వాహనం హోటల్ వద్దకు చేరుకుంది. అంతకు ముందు... వైసీపీ శ్రేణులు దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ పరామర్శించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు.