Acid attacks: ఛపాక్ చిత్రం ప్రేరణ: ఉత్తరాఖండ్ లో యాసిడ్ బాధితులకు పింఛన్!

  • రూ.7 వేలు పింఛను ఇవ్వాలని ప్రతిపాదన
  • కేబినెట్ లో చర్చించి అమలు చేస్తామన్న రాష్ట్ర మంత్రి
  • 10న విడుదలైన దీపికా పదుకొనే నటించిన ఛపాక్ చిత్రం

యాసిడ్ బాధిత యువతి కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ‘ఛపాక్’ ఇచ్చిన ప్రేరణతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాసిడ్ బాధిత మహిళలకు పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడి మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా
ఆర్యా తెలిపారు. ఢిల్లీలోని యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం నేపథ్యంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైన విషయం తెలిసిందే.

‘యాసిడ్ దాడికి గురైన మహిళలు సమాజంలో గౌరవంగా  బ్రతకడానికి ప్రతి ఏడాది రూ.7000 ఇవ్వాలని మా ప్రభుత్వం ఓ ప్రతిపాదనను రూపొందించింది.  త్వరలోనే కేబినెట్ భేటీలో చర్చించి దాన్ని అమలు చేస్తాము’ అని మంత్రి వెల్లడించారు. ఈ సినిమాపై వివాదాలు వస్తోన్నప్పటికీ.. అవన్నీ పట్టించుకోనవసరం లేదన్నారు. దాడికి గురైన యువతి లక్ష్మికే అభ్యంతరం లేనప్పుడు మిగతావారు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More Telugu News