Vijayashanthi: విజయశాంతి లెగ్ కిక్ మామూలుగా లేదు!

  • బ్రహ్మాజీపై లెగ్ కిక్ విసిరిన విజయశాంతి
  • షూటింగ్ సందర్భంగా వీడియో తీసిన వైనం
  • మాస్టర్ కిక్ అంటూ ప్రశంసించిన అనిల్ రావిపూడి
13 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయశాంతి తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇంత గ్యాప్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమెలో ఎనర్జీ, పవర్, ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. చిత్రం షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియోను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో సినీ నటుడు బ్రహ్మాజీకి విజయశాంతి కిక్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, '13 ఏళ్ల తర్వాత అద్భుతంగా పునరాగమనం చేశారు. మాస్టర్ కిక్.' అని ప్రశంసించారు. విజయశాంతికి భోగి శుభాకాంక్షలు తెలిపారు.
Vijayashanthi
Anil Ravipudi
Tollywood

More Telugu News