USA: విదేశీయులకు హిందీ పాఠాలు... అమెరికాలో భారత ఎంబసీ వినూత్న కార్యక్రమం

  • ఉచితంగా హిందీ క్లాసులు
  • భారత సాంస్కృతిక ప్రతినిధి మోక్షరాజ్ హిందీ బోధన
  • జనవరి 16 నుంచి భారత ఎంబసీలో క్లాసులు

విదేశీయుల్లో చాలామందికి భారత సంస్కృతి అంటే ఎంతో మక్కువ. మన కుటుంబ వ్యవస్థ, వైవాహిక జీవితం, యోగా, సనాతన ధర్మం, బాలీవుడ్ వంటి అంశాలపై విదేశీయులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయులతో మమేకం కావాలంటే భాష ఎంతో ముఖ్యమని భావించి హిందీ నేర్చుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ఈ విషయాన్ని గమనించిన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా హిందీ తరగతులు నిర్వహిస్తోంది. భారత ఎంబసీలో సాంస్కృతిక విభాగం ప్రతినిధి మోక్షరాజ్ ప్రత్యేకంగా హిందీ బోధించనున్నారు. జనవరి 16 నుంచి వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. హిందీ బోధనకు అమెరికన్లు, ఇతర విదేశీయులు ఎలాంటి రుసుము చెల్లించనవసరంలేదు. ఇది పూర్తిగా ఉచితం.

More Telugu News