Amaravati: 'ఎంత దారుణం? పొలాల్లో ముళ్ల కంచెలు వేశారు?' అంటూ వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
అమరావతి రాజధానిలో ఆంక్షలు విధించారని, పొలాలకు ముళ్ల కంచెలు వేశారని చెబుతూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'అమరావతి ప్రాంతంలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చి, జగన్ గారు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజలు సంతోషంగా ఉండకూడదా? పొలాల్లో ముళ్ల కంచెలు వేస్తారా?' అని ఆయన ట్వీట్ చేశారు.

'పాకిస్థాన్  సరిహద్దుని తలపించే విధంగా అమరావతి గ్రామాలను మార్చేశారు. ఎంత దారుణం? వైకాపా ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల్లా చూస్తోంది. ముళ్ల కంచెలు, పోలీసు లాఠీలతో దమనకాండ ఆపాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Jagan

More Telugu News