Nandamuri Suhasini: అమరావతి వెళ్తున్న నందమూరి సుహాసిని

  • రైతులకు సంఘీభావం ప్రకటించనున్న సుహాసిని
  • మహిళలను పరామర్శించనున్న టీడీపీ నాయకురాలు
  • ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసిన రైతులు
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కాసేపట్లో అమరావతి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతుల ఉద్యమానికి ఆమె సంఘీభావం ప్రకటించనున్నారు. తొలుత ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మహిళలను ఆమె పరామర్శిస్తారు. ఆమెతో పాటు పలువురు టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. మరోవైపు, రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. రాజధానిని మార్చబోమంటూ ప్రభుత్వం ప్రకటన చేసేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.
Nandamuri Suhasini
Telugudesam
Amaravati

More Telugu News