Vijay: 'మాస్టర్'గా విజయ్ .. భారీస్థాయిలో జరిగిన బిజినెస్

  • 'ఖైదీ' దర్శకుడి నుంచి మరో సినిమా
  • షూటింగు దశలో 'మాస్టర్'
  •  విలన్ గా విజయ్ సేతుపతి

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన తాజా చిత్రంపైనే వుంది. ఆయన తాజా చిత్రం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మధ్యనే మొదలైన రెగ్యులర్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. 'ఖైదీ' సినిమాతో లోకేశ్ కనగరాజ్ దర్శకుడిగా తన సత్తా చాటుకోవడం వలన, విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాకి 'మాస్టర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళనాట ఈ సినిమా భారీ బిజినెస్ ను జరుపుకుంది. తమిళనాట ఈ సినిమా 78 కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9.5 కోట్ల బిజినెస్ ను జరుపుకుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

More Telugu News