Nara Lokesh: గుంటూరు జైల్లో ఉన్న 19 మంది రైతులను పరామర్శించిన నారా లోకేశ్

  • రాజధాని కోసం ఉద్యమం
  • రైతుల ఆందోళనలు
  • రోడ్డు దిగ్బంధం కేసులో అరెస్టయిన రైతులు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 27 రోజులుగా జరుగుతున్న నిరసనలు ఇప్పటికీ ఆగలేదు. రాజధాని పరిధిలోని రైతులు టెంట్ లు వేసుకుని ప్రదర్శనలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. రోడ్డు దిగ్బంధం కేసులో రైతులను అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో జైలులో వున్న 19 మంది రాజధాని రైతులను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఈ రోజు పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రైతులను అడ్డుకుని ఉద్యమం అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. జేఏసీ నేతలపైనా ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Guntur
Jail
Farmers
Andhra Pradesh
Amaravati

More Telugu News