jubileehills pub: జూబ్లీహిల్స్‌లోని టాట్ పబ్‌పై దాడి.. పోలీసుల అదుపులో యువతులు

  • రోడ్డు నంబరు 10లోని టాట్ పబ్‌పై దాడి
  • అశ్లీల నృత్యాల సమాచారంతో ఏకకాలలో దాడిచేసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు
  • పోలీస్ స్టేషన్‌కు యువతుల తరలింపు
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై దాడి చేసిన పోలీసులు పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు నంబరు 10లో ఉన్న టాట్ పబ్‌లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులతోపాటు ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఆ సమయంలో పబ్‌లో యువతీ యువకులు ఉన్నప్పటికీ అశ్లీల నృత్యాల జాడ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఓ ప్రైవేటు సంస్థ ప్రత్యేకంగా పబ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని గుర్తించిన పోలీసులు.. కార్యక్రమానికి వచ్చిన వారి వివరాలను వారి గుర్తింపు పత్రాలతో పోల్చి చూసినప్పుడు సరిపోలలేదు. దీంతో కొందరు యువతులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
jubileehills pub
Hyderabad
banjarahills
girls

More Telugu News