Narasaraopeta: మహిళలు విరాళంగా ఇచ్చిన నగలను అమ్మడంలేదు... మ్యూజియంలో ప్రదర్శిస్తాం: అమరావతి జేఏసీ

  • భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యలు
  • నరసరావుపేటలో భారీ ర్యాలీ
  • వెల్లువెత్తిన విరాళాలు
అమరావతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ర్యాలీకి విపరీతమైన స్పందన లభించింది. ఈ ర్యాలీ సందర్భంగా చంద్రబాబు, ఇతర జేఏసీ నేతలకు భారీగా విరాళాలు అందాయి. నరసరావుపేట డాక్టర్ల సంఘం రూ.4 లక్షల విరాళం అందించింది. జీవీ ఆంజనేయులు అనే వ్యక్తి రూ.2 లక్షల విరాళం అందించగా, ఆయనను చంద్రబాబు అభినందించారు. నరసరావుపేట ప్రజలు గొలుసులు, గాజులు, ఉంగరాలను పెద్ద సంఖ్యలో విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ, మహిళలు విరాళంగా ఇచ్చిన ఆభరణాలను అమ్మడంలేదని, అమరావతిలో మ్యూజియం ఏర్పాటు చేసి దాతల పేరుతో ప్రదర్శిస్తామని చెప్పారు. మహిళల దాతృత్వాన్ని భావితరాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
Narasaraopeta
Guntur District
Andhra Pradesh
Amaravati
JAC

More Telugu News