Prudhvi Raj: నాపై ఆరోపణలు నిజమైతే ‘ఈ చెప్పుతో నన్ను కొట్టండి’: పృథ్వీరాజ్

  • నా పై ఇంత కక్ష ఉందని అనుకోలేదు 
  • ‘చాలా డిస్ట్రబ్’ అయ్యాను
  • పృథ్వీరాజ్ ఎవరికి అన్యాయం చేశాడు?
తిరుమలను అపవిత్రం చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలు కనుక నిజమైతే ‘ఇదే చెప్పు మీకిస్తాను.. చెప్పుతో కొట్టండి’ అంటూ తన చెప్పును చూపిస్తూ పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలతో మానసికంగా ‘చాలా డిస్ట్రబ్’ అయ్యానని చెప్పారు. ‘నా పై ఇంత కక్ష ఉందని నేను అనుకోలేదు.  పృథ్వీరాజ్ ఎవరికి అన్యాయం చేశాడు? ఎంక్వయిరీలో నిజానిజాలు తెలుస్తాయి’ అని అన్నారు. తనపై ఎవరు కుట్ర చేశారో తనకు తెలియదని, తెలిస్తే జాగ్రత్తపడేవాడినని, తమ పార్టీలో తనపై కుట్ర చేసేవారెవరూ లేరని అన్నారు. తాను దీక్షలో ఉండి శబరిమల వెళ్లినప్పుడు తనపై కుట్ర జరుగుతోందన్న విషయాన్ని అక్కడ ఓ జర్నలిస్టు మిత్రుడు తనకు చెప్పాడని గుర్తుచేసుకున్నారు.
Prudhvi Raj
TTD
SVBC
YSRCP

More Telugu News