Ala Vaikunthapuramulo: కంగ్రాట్స్ బావా... అదిరిపోయింది స్వామీ: 'అల.... వైకుంఠపురములో' చిత్రంపై జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు

  • నేడు 'అల... వైకుంఠపురములో' చిత్రం రిలీజ్
  • చిత్రంపై తన అభిప్రాయాలు వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్
  • బన్నీ, త్రివిక్రమ్ పై ప్రశంసల జల్లు
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడంతో కోలాహలం నెలకొంది. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం నిన్న రిలీజ్ కాగా, నేడు అల్లు అర్జున్ చిత్రం అల... వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో, అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ అల... వైకుంఠపురములో చిత్రంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ కనబర్చాడని కితాబిచ్చారు. ఎంతో సునాయాసంగా హిట్ కొట్టాడని అభినందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. "కంగ్రాట్స్ బావా... అల... వైకుంఠపురములో చిత్రం అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మాటలు రాశారు... కంగ్రాట్స్ స్వామీ" అంటూ ట్వీట్ చేశారు.

"మురళీశర్మ గారి నటనకు హ్యాట్సాఫ్. క్యారెక్టర్ రోల్ ను పండించారు. తమన్ ఇచ్చిన సంగీతం అమోఘం. ఈ సినిమాకు ప్రధానబలం సంగీతమే. పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు యావత్ చిత్రబృందానికి శుభాభినందనలు అంటూ తారక్ తన అభిప్రాయాలు వెల్లడించారు.
Ala Vaikunthapuramulo
Allu Arjun
Trivikram
Tollywood
Jr NTR
Tarak

More Telugu News