హిందూ దేవుళ్లకు అవమానం... అమెజాన్ ను బాయ్ కాట్ చేయాలని ప్రచారం!

12-01-2020 Sun 12:09
  • మ్యాట్లపై హిందూ దేవుళ్లు
  • తీవ్ర విమర్శల పాలైన అమెజాన్ చర్య
  • ఆన్ లైన్ నుంచి తొలగించామని వివరణ

బాత్ రూమ్ రగ్గులు, డోర్ మ్యాట్లపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించి ఆన్ లైన్ మాధ్యమంగా విక్రయిస్తున్న అమెజాన్ ను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ తరహా ప్రొడక్టులతో భారత సంస్కృతి, సంప్రదాయాలను అవమానిస్తున్నారంటూ వేలాది మంది అమెజాన్ పై మండిపడుతున్నారు. భారత సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్ ను బహిష్కరించాలని అంటున్నారు. ఇక చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టుగా, వివాదానికి కారణమైన దేవతా చిత్రాలున్న మ్యాట్స్, బాత్ రూమ్ రగ్గులను తొలగిస్తున్నట్టు పేర్కొంది. అమెజాన్ లో ఇటువంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు.